కేసముద్రం, ఏప్రిల్ 10: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మార్కెట్లో మిర్చి ధర తగ్గిందని రైతులు ఆందోళన చేశారు. ఈ మేరకు మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడించారు. బుధవారం మిర్చి క్వింటాల్‌కు రూ.9 వేల నుంచి రూ.15 వేల వరకు ధర పలికింది. మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం మారెట్లలో క్వింటాల్ మిర్చి ధర రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు పలికిందని తెలుసుకున్న రైతులు కేసముద్రం మారెట్లో ఆందోళన చేశారు. వ్యాపారులు కుమ్మకై కావాలని ధరలు తగ్గిస్తున్నారని ఆరోపించారు. తేమ శాతం తకువగా ఉన్న నాణ్యమైన మిర్చికి కూడా వ్యాపారులు ధరలు తగ్గించాలని రైతులు పేర్కొన్నారు. ఈ ధరకు అమ్మితే కూలీలకు ఇచ్చిన డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోయారు. ఈ విషయం తెలుసుకున్న మారెటింగ్ శాఖ డీఎన్‌వో వెంకటరెడ్డి, సీఐ సర్వయ్య ఘటనా స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. రైతులు, రైతు సంఘం నాయకులు, వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చలు జరిపారు. వ్యాపారులు క్వింటాల్‌కు రూ.500 నుంచి రూ.1000 వరకు పెంచడంతో రైతులు ఆందోళన విరమించారు.