Mulugu | ములుగు జిల్లా వెంకటాపురం (నూగురు)లో మిర్చీ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పంట చేతికి వచ్చిన సమయంలో కూలీలు దొరక్క.. పంట నేలరాలిపోతుందనే మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెస్తగూడానికి చెందిన రామెల్ల సతీశ్ (39) అనే రైతు మూడు ఎకరాల్లో మిర్చీ సాగు చేస్తున్నాడు. పంట చేతికి వచ్చిన సమయంలో కూలీలు దొరక్క పంట అంతా రాలిపోతుంది. దాంతో రమేశ్ మనస్తాపానికి గురయ్యాడు. క్రమంలోనే గత 15 రోజులుగా మద్యం సేవించి తిరుగుతూ వస్తున్నాడు. సోమవారం ఉదయం మిర్చీ తోట వద్దకు వచ్చి మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే కుటుంబ సభ్యులు వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం హన్మకొండ ఎంజీఎంకు తరలించారు. ఆసుప్రతిలో చికిత్స పొందుతూ రమేశ్ ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కొప్పలు తిరుపతిరావు తెలిపారు.