హైదరాబాద్, జూన్ 15(నమస్తే తెలంగాణ): ఆరేండ్ల చిన్నారిపై లైగింక దాడికి పాల్పడి అనంతరం హత్యచేసిన ఘటనను తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(టీజీఎస్సీపీసీఆర్) తీవ్రంగా పరిగ ణించింది. శనివారం మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా స్వీకరించింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో ఓ కామాంధుడు చిన్నారిని అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటనపై దర్యాప్తు నిర్వహించి చర్యలు తీసుకోవాలని కమిషన్ చైర్మన్ జే శ్రీనివాస్‌రావు కలెక్టర్‌ను ఆదేశించారు. ఇప్పటివరకు తీసుకున్న చర్యల(ఏటీఆర్)పై నివేదిక సమర్పించాలని పేర్కొన్నారు.