హయత్‌నగర్, నవంబర్ 4: ప్రమాదవశాత్తు స్కూల్ గేటు పడి ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హయత్‌నగర్‌లోని ఎంపీపీ స్కూల్లో అలకంటి అజయ్(6) ఒకటో తరగతి చదువుతున్నాడు. స్కూల్ విడిచిన తర్వాత సాయంత్రం 4 గంటలకు అజయ్, తోటి మిత్రులతో కలిసి స్కూల్ గేటుతో ఆడుకుంటున్నాడు. కొంతమంది పిల్లలు గేటును అటూ ఇటు ఊపుతుండగా వెల్డింగ్ జాయింట్లు ఊడిపోయి అజయ్‌పై పడింది. ఈ ఘటనలో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స కోసం హయత్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. ఆ తర్వాత వనస్థలిపురం ఏరియా దవాఖానలో అతడిని పరిశీలించిన వైద్యులు మృతి చెందినట్టు నిర్ధారించారు.
మైనార్టీల అభ్యున్నతికి కృషి చైర్మన్ ఒబెదుల్లా
హైదరాబాద్, నవంబర్ 4(నమస్తే తెలంగాణ): మైనార్టీల అభ్యున్నతికి ప్ర భుత్వం కట్టుబడి ఉన్నదని మైనార్టీ ఫైనా న్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబెదుల్లా తెలిపారు. బడ్జెట్లో మైనార్టీల సంక్షేమానికి రూ.3 వేల కోట్లు, అందులో మైనార్టీ కార్పొరేషన్‌కు రూ.432 కోట్లను ప్రభు త్వం కేటాయించిందని గుర్తుచేశారు. సోమవారం నాంపల్లిలోని హజ్‌హౌస్‌లో కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అనంతరం ఒబెదుల్లా మీడి యాతో మాట్లాడుతూ విద్యార్థుల యూనిఫాం ఆర్డర్లను మైనార్టీ మహిళలకు ఇవ్వనున్నట్టు వెల్లడించారు.