దేవరకద్ర రూరల్ (చిన్న చింతకుంట), జూన్ 5: ఊయలే ఓ చిన్నారికి ఉరితాడైంది. చీరతో కట్టిన ఊయలలో ఊగుతుండగా మెడకు చుట్టుకొని బాలిక మృతి చెందింది. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం ఉంద్యాల గ్రామంలో బుధవారం చోటు చేసుకున్నది. ఉంద్యాలకు చెందిన గొల్ల కురుమన్న, శైలజ కూతురు అనూషిత (11) తోటిపిల్లలతో కలిసి చెట్టుకు చీరతో కట్టిన ఊయలలో ఆడుకుంటున్నది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు పాప మెడకు చీర బిగుసుకొని అపస్మారక స్థితిలోకి చేరుకున్నది. ఆలస్యంగా గమనించిన తల్లిదండ్రులు వెంటనే అమరచింత దవాఖానకు తరలించగా.. అప్పటికే చిన్నారి మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.