హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): బెంగళూరు, చెన్నై, పుణెలతో కలిపే హైస్పీడ్ రైల్ కారిడార్ ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టిసారించిందని సీఎస్ కే రామకృష్ణారావు తెలిపారు. ఈ మేరకు గురువారం దక్షిణ మధ్య రైల్వేజోన్ జనరల్ మేనేజర్‌తో ఆయన సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్‌లోని పలు రైల్వే ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్ మార్గాలు, వాటికి సంబంధించిన భూసేకరణ, వ్యయ భాగస్వామ్యం తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.