హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తేతెలంగాణ): ప్రభుత్వ గురుకుల పాఠశాలల విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో విద్యాప్రమాణాల పెంపునకు చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. గురుకుల పాఠశాలల విద్యార్థుల ప్రతిభా నైపుణ్యాలను వెలికితీసి రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములను చేస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాలకు ప్రభుత్వం కామన్ డై ట్ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించింది.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరులోని టీజీ సోషల్ వెల్ఫేర్ స్కూల్ లో సీఎం ప్రారంభించగా, మంత్రులు వివిధ ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నా రు. చిలుకూరులో సీఎం మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ పిల్లలకు నాణ్యమైన విద్యనందించేందుకు తమ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇందుకోసమే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఓ సబ్ కమిటీని ఏర్పాటు చేశామని వెల్లడించారు. పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకొని 40 శాతం డైట్ చార్జీలతోపాటు, కాస్మెటిక్ చార్జీల ను పెంచామని పేర్కొన్నారు. వారంలో రెండుసార్లు రెసిడెన్షియల్ స్కూళ్ల విద్యార్థులకు అం దించే భోజనాన్ని తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. విద్యార్థుల సా మర్థ్యాలను పెంపొందించే లక్ష్యంతో టాటా గ్రూప్స్ సహకారంతో రాష్ట్రంలోని 75 ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ విప్ పట్నం మహేందర్రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పాల్గొన్నారు.