అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల సముదాయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ఎనుముల రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
ప్రభుత్వ గురుకుల పాఠశాలల విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో విద్యాప్రమాణాల పెంపునకు చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు.