Cm KCR | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) దంపతులు నేడు సిద్దిపేట జిల్లాలోని చింతమడక (Chintamadaka) గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. గ్రామంలోని 13వ పోలింగ్ కేంద్రంలో ఓటు వేయనున్నారు. సీఎంకు చింతమడక గ్రామం ఒక సెంటిమెంట్. సీఎం దంపతులు చింతమడకకు వెళ్తుండటంతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఓట్ల లిస్టులో కేసీఆర్ సీరియల్ నెంబర్ 158గా ఉంది. ఓటరు కార్డు సంఖ్య SAG 0399691గా ఉంది. సీఎం సతీమణి శోభమ్మ సీరియల్ నంబర్ 159, ఓటరు కార్డు నంబర్ SAG 0761676గా ఉంది. సీఎం ఓటు వేసేందుకు చింతమడకు వెళ్తుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read..
Minister KTR | ఓ పౌరుడిలా నా బాధ్యతను నిర్వర్తించాను : మంత్రి కేటీఆర్
TS Assembly Elections | తెలంగాణలో కొనసాగుతున్న పోలింగ్.. తొలి రెండుగంటల్లో 8.52శాతం నమోదు
TS Assembly Elections | ఓటేసిన సినీ ప్రముఖులు