చెన్నూర్, ఏప్రిల్ 19: మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లోని 16వ వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్ తుమ్మ రమేశ్‌తోపాటు 200 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల వారు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.