హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): థాయ్‌లాండ్ కేసులో చీకోటి ప్రవీణ్‌ను హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో సోమవారం విచారించారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 8 గంటల వరకు విచారణ సాగింది. థాయ్‌లాండ్ క్యాసి నో కేసుకు సంబంధించి ప్రత్యేకంగా మహిళలతో డెన్ ఏర్పాటు చేయడం, జూదం ఆడటం, కోట్లాది రూపాయలు ఖర్చుచేయడం వంటి ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు ప్రవీణ్. సోమవారం చీకోటితో కలిసి ఈడీ కా ర్యాలయంలోకి వెళ్లిన ఇద్దరు న్యాయవాదులు కొద్దిసేపటికే బయటికి వచ్చా రు. అనంతరం థాయ్‌లాండ్ గ్యాంబ్లిం గ్కేసుపై చీకోటిని విచారించారు.
తర్వా త చీకోటి ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ నకిలీ సర్టిఫికెట్లతో తనకు ఇన్విటేషన్ పెట్టారని, అది తెలుసుకొని అకడ ఉన్న న్యాయస్థానం తమకు 2,000 బాత్‌లు ఫైన్ విధించిందని చెప్పారు. టీడీపీ నేత పట్టాభి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. లగ్జరీ కార్ల కొనుగోలు అంశం ప్రస్తుతం ఐటీ శాఖ దర్యాప్తు చేస్తున్నదని, ఈడీ ప్రశ్నలకు సమాధానం చెప్పానని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి మరోమారు ఈడీ విచారణ చేపట్టనున్నట్టు తెలిసింది.