హైదరాఆద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): తూనికలు, కొలతలపై తనిఖీలను ముమ్మరం చేయాలని, అవకతవకలకు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖమంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. ఈవోడీబీ(ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్) చట్టం పేరుతో వినియోగదారుల హకులకు భంగం కలిగిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో జరిగిన తూనికలు, కొలతల శాఖ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. తూనికలు, కొలతల శాఖపై వినియోగదారుల్లో చైతన్యం పెంపొందించాలని సూచించారు. పెట్రోల్బంక్లతో పాటు వేయింగ్ మిషన్లపై నిఘా పెంచాలని చెప్పారు. తూనికలు కొలతల శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమీక్షలో పౌరసరఫరాల శాఖ, తూనికలు కొలతల శాఖ ముఖ్యకార్యదర్శి డీఎస్ హన్, సహాయ కార్యదర్శి ప్రియాంక, అసిస్టెంట్ కంట్రోలర్ రాజేశ్వర్‌తోపాటు అసిస్టెంట్ కమిషనర్లు పాల్గొన్నారు.