హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): సాయి ధరమ్‌తేజ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న గాంజా శంకర్ సినిమాకు పేరు మార్చాలని తెలంగాణ నార్కోటిక్ బ్యూరో పోలీసులు చిత్ర యూనిట్‌కు నోటీసులు పంపారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే యూట్యూబ్‌లో ‘గాంజాశంకర్ ఫస్ట్ హై’ పేరుతో ఒక వీడియో అప్లోడ్ అయ్యింది. ఆ ట్రైలర్‌ను బట్టి చూస్తే ఇందులో హీరో గంజాయి పండించే బిజినెస్ చేస్తున్నాడని అర్థమవుతుంది’ అంటూ ఈ నోటీసుల్లో పేరొన్నారు. సినిమాలో గంజాయి అనే పదాన్ని తొలగించాలని పేరొన్నారు. సినిమా తెరకెకిన తర్వాత మాదకద్రవ్యాలకు సంబంధించిన అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉంటే ఎన్డీపీఎస్-1985 యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సినిమాలో గంజాయి మొకలను చూపించడంతోపాటు గంజాయి వాడకాన్ని ప్రోత్సహించే విధంగా సన్నివేశాలు ఉన్నట్టు ఆ వీడియో ద్వారా తమ దృష్టికి వచ్చిందని నార్కోటిక్ అధికారులు పేరొన్నారు. ‘గాంజా శంకర్’ అనే టైటిల్ విద్యార్థులు సహా యువత మీద ప్రభావం చూపే అవకాశం ఉన్నదని, మాదకద్రవ్యాల వాడకం సర్వసాధారణం అని సందేశం ఇచ్చేలా ఉన్న సీన్స్ తొలగించాలని, అసలు గంజాయి అనే పదమే లేకుండా డైలాగులు రాసుకోవాలని నోటీసుల్లో పేరొన్నారు. ఈ నోటీసులపై సినిమా యూనిట్ ఎలా స్పందించనుందనేది ఆసక్తికరంగా మారింది. సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సూపర్‌హిట్‌గా నిలిచిన తర్వాత.. రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇదే కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీగానే అంచనాలు ఉన్నాయి.