హైస్కూళ్ల పనివేళల్లో మార్పు
ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పనివేళల్లో స్వల్ప మార్పులు చేస్తూ విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి ఉదయం 9 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు పని చేయనున్నాయి.
- ఇకపై 9 నుంచి 4.15 గంటల వరకే
- జంటనగరాల్లో మాత్రం యథావిధిగా
హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పనివేళల్లో స్వల్ప మార్పులు చేస్తూ విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి ఉదయం 9 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు పని చేయనున్నాయి. ఇంతకుముందు హైస్కూళ్లు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పని చేశాయి. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు యథావిధిగా ఉదయం 9 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు, హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో కూడా యథావిధిగా ఉదయం 8.45 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతాయి. ట్రాఫిక్ కారణాల దృష్ట్యా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో పాఠశాలల సమయాన్ని మార్చలేదని ఉత్తర్వులో పేర్కొన్నారు.
ఇంకా చదవల్సిన వార్తలు
డీఎస్సీకి 84% మంది హాజరు
హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న డీఎస్సీ ప్రశాంతంగా జరుగుతున్నట్టు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నరసింహారెడ్డి తెలిపారు. మూడోరోజు శనివారం నిర్వహించిన ఆన్లైన్ పరీక్షలకు 84 శాతం మంది హాజరైనట్టు పేర్కొన్నారు. 3,504 మందికి 2,931 మంది హాజరయ్యారని, 573 మంది(16శాతం) మంది గైర్హాజరయ్యారని వివరించారు. 11,062 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది.
‘విద్యుత్తు ఉద్యోగులకు పదోన్నతులు కల్పించండి’
హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు రంగంలో సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగులకు వెంటనే ప్రమోషన్లు కల్పించాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) డిమాండ్ చేసింది. ప్రమోషన్ల కోసం ఏడేండ్లుగా ఎదురుచూస్తున్నారని తెలిపింది. శనివారం జేఏసీ కన్వీనర్ ఎన్ శివాజీ, కో చైర్మన్ పీ అంజయ్య ఆధ్వర్యంలో సభ్యులు టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీతో సమావేశమయ్యారు. 30 ఏండ్ల సర్వీసు చేసి సీనియారిటీ ఉండి కూడా ఓ ఉద్యోగి ప్రమోషన్ లేకుండా రిటైర్డ్ కావడం బాధాకరమని వాపోయారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సీఎండీకి అందజేశారు. సమావేశంలో జేఏసీ నాయకులు రామేశ్వర్‌శెట్టి, నాజర్షరీఫ్, కరెంట్‌రావు, పీఎం రాజు, రామకృష్ణారెడ్డి, కే వెంకటేశ్, రాజేశ్, లక్ష్మయ్య, అక్బర్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

