హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): గురుకుల విద్యాలయాల టైంటేబుల్‌ను గతంలో మాదిరిగా మార్చాలని గురుకుల సొసైటీల కార్యదర్శులకు అసోసియేషన్లు ముక్తకంఠంతో తేల్చిచెప్పాయి. ఎస్సీ, ట్రైబల్ గురుకుల సొసైటీలు గురుకుల బోధన, బోధనేతర ఉద్యోగ సంఘాలతో కో ఆర్డినేషన్ సమావేశాన్ని శనివారం ప్రత్యేకంగా నిర్వహించాయి.
టైంటేబుల్ మార్పు, సమస్యలు, ప్రతిపాదనలపై చర్చించాయి. ప్రభుత్వం కొత్తగా అమలుచేసిన కామన్ టైంటేబుల్పై సొసైటీ లు అసంతృప్తి వ్యక్తంచేశాయి. గతంలో మాదిరిగా ఉదయం 9 నుంచి సాయంత్రం 4:30 గంటలకు టైంటేబుల్‌ను సవరించాలని ప్రతిపాదించాయి. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అధికారులు వెల్లడించారు.