నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ రోజే బీజేపీకి గట్టి దెబ్బ తగిలింది. ఇటీవల బీజేపీలో చేరిన చండూరు జడ్పీటీసీ సభ్యుడు కర్నాటి వెంకటేశం తిరిగి టీఆర్ఎస్లో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సోమవారం కర్నాటి వెంకటేశం తన అనుచరులతో కీలక సమావేశం జరిపారు. ఇందులో పలు విషయాలపై చర్చించారు. టీఆర్ఎస్తోనే గట్టుప్పల్ ఉంటుందన్నారు. గట్టుప్పల్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ఉప ఎన్నికలో టీఆరెఎస్నే గెలిపించుకోవాలని చెప్పారు. తనను బలవంతంగా బీజేపీలోకి చేర్చుకున్నారని ఆరోపించారు. గట్టుపల్ మండలం రావడం, ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇవన్నీ టీఆర్ఎస్తోనే సాధ్యమని, టీఆర్ఎస్లో చేరాలని మంత్రి కేటీఆర్ తనను ఆహ్వానించారని, టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. గట్టుప్పల్లో టీఆర్ఎస్కు భారీ మెజారిటీ ఇచ్చి అభివృద్ధి నిధులు తెచ్చుకుందామని పేర్కొన్నారు.