Chandrababu | హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరగా కోలుకోని ప్రజాసేవలోకి రావాలని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో కేసీఆర్ను పరామర్శించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ను చూడాలనిపించి వచ్చాను. కేసీఆర్ కోలుకోవడానికి ఆరు వారాల సమయం పడుతుందని వైద్యులు చెప్పారు. కేసీఆర్కు వైద్యులు చాలా చక్కగా ఆపరేషన్ చేశారు. త్వరలోనే కేసీఆర్ మామూలుగా నడుస్తారు. అప్పుడప్పుడు కొన్ని దురదృష్టకర ఘటనలు జరుగుతుంటాయి అని చంద్రబాబు పేర్కొన్నారు.
ఇటీవలే కేసీఆర్కు తుండి మార్పిడి శస్త్ర చికిత్స చేశారు వైద్యులు. వాకర్ సాయంతో కేసీఆర్ నడుస్తున్నారు. కేసీఆర్ కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో కేసీఆర్ను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. 6 నుంచి 8 వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు పేర్కొన్న సంగతి తెలిసిందే.