హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదిపై ప్ర కాశం బ్యారేజీ ఎగువన వైకుంఠపురం వద్ద ఒకటి, దిగువన చోడవరం వద్ద మరొక బ్యారేజీ నిర్మిస్తామని ఏపీ సీ ఎం చంద్రబాబునాయుడు స్పష్టంచేశారు. ఈ మేరకు బుధవారం విజయవాడలో నిర్వహించిన ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రెండు బ్యారేజీల నిర్మాణంతో విజయవాడ నీటితో కళకళలాడనున్నట్టు తెలిపారు.
హైదరాబాద్కు ఐటీ, టెక్నాలజీ తన ఘనత అని చెప్పుకునే చంద్రబాబు మరోసారి వర్షానికి కారణం కూడా తానేనని బడాయికి పోయారు. తాజాగా ఏపీలో జరిగిన ఓ సభలో ఆయన ప్రసంగిస్తూ.. ‘ఈ సారి వర్షపాతం తక్కువగా పడింది. విశాఖపట్నంలో మాత్రం వరుణ దేవుడు కరుణించి.. మేమంతా ప్రార్థిస్తే ఒకే రోజు 27 సెం.మీ వర్షపాతం నమోదైంది. అదే వరుణ దేవుడికి మన మీద ఉండే కరుణ’ అని సెలవిచ్చారు. ఇక చంద్రబాబు వ్యాఖ్యలపై నెటిజన్లు ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు.