KCR Birthday | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆనందం ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు. అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సైతం కేజీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. తన పోరాట పటిమతో అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. 70వ జన్మదిన వేళ కేసీఆర్కు ఆ భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని, సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నానంటూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.