హైదరాబాద్, సెప్టెంబర్ 14(నమస్తే తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలో ఇటీవల కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్ పర్యటించింది. ఈ సందర్భంగా సోమేశ్వరాలయ ఆవరణలోని చండికాంబగుడి లోపలి మెట్టు వద్ద కాకతీయుల కాలంనాటి శాసనాన్ని గుర్తించారు. ఈ శాసనం 13వ శతాబ్దపు తెలుగులిపిలో ఉన్నదని పేర్కొన్నారు. ఇందులో వరంగల్ కాకతీయ మహారాజు గణపతిదేవుడు అనుమకొండ పురవేశ్వరుడిగా పేర్కొన్నారు. గుడిమెట్టును తొలగించి ఈ శాసనాన్ని కొలనుపాక మ్యూజియంలో భద్రపరచాలని పురావస్తు అధికారులకు విజ్ఞప్తి చేశారు.