కొండాపూర్, అక్టోబర్ 8: ముగ్గురు వ్యక్తుల నుంచి 6 కిలోల బంగారాన్ని చందానగర్ పోలీసులు ఆదివారం రాత్రి పట్టుకున్నారు.
ముంబై నుంచి లింగంపల్లి తారానగర్ మార్కెట్‌కు రూ.3.50 కోట్ల విలువచేసే 6 కిలోల బంగారు ఆభరణాలను తరలిస్తున్నట్టు వచ్చిన సమాచారం మేరకు మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు రంగంలోకి దిగారు. ఆభరణాలు తరలిస్తున్న రితేశ్, నవీన్, ఆనంద్‌ను అదుపులోకి తీసుకొని, బంగారాన్ని సీజ్ చేశారు.