హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): మరో ఇద్దరు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల చేపట్టిన బదిలీల్లో వెయిటింగ్లో ఉన్న 2012వ బ్యాచ్‌కు చెందిన జీ చందనాదీప్తిని నల్లగొండ ఎస్పీగా బదిలీ చేశారు. అక్కడ ఎస్పీగా విధులు నిర్వర్తించిన 2014 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన కే అపూర్వరావును సీఐడీలోని ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీగా నియమించారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని సీఎస్ శాంతికుమారి పేర్కొన్నారు.