హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ) : టీచర్ ఉద్యోగాల నియామక పరీక్ష డీఎస్సీ దరఖాస్తుల్లో దొర్లిన తప్పుల సవరణకు పాఠశాల విద్యాశాఖ అవకాశం కల్పించింది. బుధవారం ఆయా అభ్యర్థులు https //schooledu.telangana.gov. in వెబ్సైట్ ద్వారా దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన అభ్యర్థులకు సూచించారు. రాష్ట్రంలో 5,089 టీచర్ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ ఈ ఏడాది సెప్టెంబర్ 6న నోటిఫికేషన్ జారీచేయగా, 1.77 లక్షల దరఖాస్తులొచ్చాయి.