హనుమకొండ చౌరస్తా : క్రీడలకు, క్రీడాకారులకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ( Chamber of Commerce ) ఇథోదికంగా సహాయ, సహకారాలు అందిస్తుందని వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ బొమ్మినేని రవీందర్‌రెడ్డి ( President Ravinder Reddy) అన్నారు.
వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి చదరంగం ఎంపిక పోటీల ముగింపు కార్యక్రమానికి ఛాంబర్ ప్రెసిడెంట్ బొమ్మినేని రవీందర్ రెడ్డి, సీనియర్ సివిల్ జడ్జి ( Senior Civil Judge) క్షేమాదేశ్పాండే ( Kshemadesh Pandey ) హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ చదరంగం క్రీడ మేధో సంపత్తుకు సంబంధించినది, జిల్లా , జాతీయ, అంతర్జాతీయస్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులకు తమ వంతు సహాయసహకారాలు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా పిల్లలను చదరంగం వైపు ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను అభినందించారు.
జడ్జి క్షేమాదేశ్పాండే మాట్లాడుతూ ఓటమి కూడా గెలుపుకు నాందిగా మలుచుకోవాలని సూచించారు. అనంతరం నిర్వహణ కార్యదర్శి కన్నా మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి నుంచి సుమారు 35 మంది క్రీడాకారులు పాల్గొనగా అండర్-9 బాలుర విభాగం నుంచి శ్రేయన్రామ్ శివరాత్రి, అక్షత్వాన్, వేదాంష్ విశ్వంబర, ప్రత్యూమ్నారెడ్డి మొదటి నాలుగు స్థానాల్లో నిలిచారని వెల్లడించారు.
బాలికల విభాగంలో తోట జాన్వీ, పి సాన్విక, ఏ ఆద్య, టి ఆద్య, అండర్-11 బాలుర విభాగం నుంచి బొల్లం సాయిజోషిత్, డి జితేష్, ఎం వర్షిత్‌కుమార్, కే హిమాన్షు, బాలికల విభాగం నుంచి అల్పుల హరిప్రియ, కే నిహారిక, కే సహస్ర, కే నిత్య వచ్చేనెల హైదరాబాద్‌లో జరుగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు వరంగల్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మాడూరి వేదప్రకాష్, ట్రెజరర్ అల్లె సంపత్, ప్రేమ్‌సాగర్ ఉన్నారు.