హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): సమస్యల పరిష్కారానికి దేశ వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలు పోరుబాట పట్టనున్నారు. చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసేందుకు అంగన్వాడీ టీచర్ల సంఘాలు ప్రణాళిక రూపొందిస్తున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అంగన్వాడీల్లో సుమారు 26లక్షల మంది టీచర్లు, ఆయాలు పనిచేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు తమను రెగ్యులర్ చేయటంతోపాటు వడ్డీతో సహా గ్రాట్యుటీ చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకోసం ఈ నెల 13న తెలంగాణ నుంచి దాదాపు 5వేల మంది చలో ఢిల్లీకి వెళ్లనున్నట్టు అంగన్వాడీ టీచర్ల సంఘం రాష్ట్ర నాయకురాలు జయలక్ష్మి(సీఐటీయూ) తెలిపారు.