హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ ) : రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ తెలంగాణ రాష్ట్రం (ఎస్‌ఎల్‌టీఏ టీఎస్) నూతన అధ్యక్షుడిగా చక్రవర్తుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా కర్రెం గౌరీశంకర్రావులను ఎన్నుకొన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో సంఘం నూతన కార్యవర్గం ఎన్నికైంది.
గౌరవాధ్యక్షులుగా చౌడవరం చంద్రమోహన్, పెండ్యాల బ్రహ్మయ్య, గౌరవ సలహాదారులుగా సుబ్బారావు, రాష్ట్ర సహ అధ్యక్షులుగా షేక్ హాజీ నురానీ, సత్యనారాయణ, కాంబ్లీ, కోశాధికారిగా జగదీశ్వర్, సంయుక్త కార్యదర్శిగా మరిపల్లి రమేశ్, కార్యవర్గ సభ్యులుగా జీవీవీ ప్రసాద్, ఎన్వీ శ్రీదేవి, రాఘవేంద్ర దోత్రే, ఎండీ హమీద్, బొల్ల కుమారస్వామి, ముడుంబ ప్రవీణ్‌ను ఎన్నుకొన్నారు.