హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దొరల దాష్టీకాలను ఎదిరించి పోరాడిన వీరనారి చి ట్యాల ఐలమ్మ (చాకలి ఐలమ్మ) పోరాటాన్ని చిట్టెలుక పోరాటంగా బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్‌రెడ్డి అభివర్ణించడంపై బీసీ రాజ్యాధికార సమితి కన్వీనర్ దాసు సురేశ్ తీవ్రంగా మండిపడ్డారు.
అలాంటి చవకబారు మాటలను బీజేపీ వెంటనే వెనకి తీసుకోవాలని, బీసీలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని గురువా రం ఆయన ఓ ప్రకటనలో డిమాం డ్ చేశారు. బహుజన నాయకుల పోరాటాలను కించపరచడం బీజేపీ నేతలకు పరిపాటిగా మారిందని ధ్వజమెత్తారు. బీసీల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన ప్రకాశ్‌రెడ్డి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే తగిన బుద్ధి చెబుతామని ఆ ప్రకటనలో హెచ్చరించారు.