తానూర్, ఆగస్టు 14 : నిర్మల్ జిల్లా తానూర్ మండలం భోసి గ్రామంలో బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని స్వల్పంగా ధ్వంసం చేశారు. గురువారం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై షేక్ జుబేర్ ఘటనా స్థలానికి చేరుకుని ధ్వంసమైన విగ్రహాన్ని పరిశీలించారు. వివిధ సంఘాలు, పార్టీల ఆధ్వర్యంలో గ్రామస్థులు భోసి ఎక్స్‌రోడ్ వద్ద ధర్నాకు దిగారు. తహసీల్దార్ మహేందర్నాథ్ ఆందోళనకారులకు నచ్చజెప్పి ధర్నా విరమింపజేశారు.