హైదరాబాద్, సెప్టెంబర్ 1(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సంక్షేమంపై చర్చించినట్టు తెలిసింది. 8న రవీంద్రభారతిలో నిర్వహించనున్న జేఎన్‌జేహెచ్‌ఎస్ స్థలాల అప్పగింత కార్యక్రమంపై, రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఆరోగ్య పథకం ఇతర సంక్షేమాలకు సంబంధించిన అంశాలపై చర్చ జరిగినట్టు సమాచారం.
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఐసెట్ వెబ్ కౌన్సెలింగ్ ఆదివారం నుంచి ప్రారంభమైంది. తొలిరోజు 3,057 మంది కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. 8 వరకు ప్రాసెసింగ్ ఫీజును చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. 3 నుంచి 9వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను చేపడతారు.