హైదరాబాద్, సెప్టెంబర్ 22(నమస్తే తెలంగాణ): విజయ డెయిరీ పాడి రైతులకు త్వరలోనే బిల్లులు చెల్లిస్తామని తె లంగాణ డెయిరీ డెలవప్మెంట్ సొసైటీ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి తెలిపారు. అప్పటిదాకా రైతులు సహకరించాలని ఆదివారం ప్రకటనలో కోరారు. విజ య డెయిరీ ద్వారా నాణ్యమైన పాలు, పాల ఉత్పత్తులను విక్రయిస్తున్నామని పేర్కొన్నారు.
ప్రజలు ఆదరించి సంస్థ సొసైటీ అభివృద్ధికి సహకరించాలని కో రారు. నిత్యం 4.20 లక్షల లీటర్ల పాల ను సేకరిస్తున్నామని, మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తె లిపారు. హైదరాబాద్‌లో పొరుగు రా ష్ర్టాల డెయిరీలు తక్కువ ధరకే పాలు, పాల ఉత్పత్తులను విక్రయిస్తుండటం తో విజయ డెయిరీ ఉత్పత్తుల అమ్మకాలు పడిపోయాయని పేర్కొన్నారు