హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు చైర్మన్‌గా సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి నియామకమయ్యారు. బుధవారం రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ట్రస్టు చైర్మన్‌గా జాతీయ మాజీ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి మరణించిన నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిగా చా డ, కోశాధికారిగా మా జీ ఎంపీ రావి నారాయణరెడ్డి మనుమరా లు రావి ప్రతిభను ని యమించారు. ట్రస్టు కార్యదర్శి ప్రతాపరె డ్డి నివేదిక సమర్పించారు. సీపీఐ శతజయ ంతి ఉత్సవాల సందర్భంగా బహిరంగ స భతోపాటు, ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.