హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): సీపీఐ శత వసంతాల వేడుకలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి కోరారు. తెలంగాణ ప్రజానాట్య మండలి, అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో హిమాయత్‌నగర్‌లోని సత్యనారాయణరెడ్డి భవన్లో ఆదివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ 30న నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు.
దేశ వ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణకు సీపీఐ ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు తెలిపిందని, అదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శంకర్, బాల నరసింహ, ఈటీ నరసింహ, ప్రజానాట్య మండలి అధ్యక్షుడు కే శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ, ప్రముఖ గాయకులు ఏపూరి సోమన్న, గిద్దె రామనర్సయ్య, మచ్చ దేవేందర్, శివ, భరత్, అరసం రాష్ట్ర అధ్యక్షుడు పల్లేరు వీరస్వామి, జాతీయ కార్యదర్శి వేల్పుల నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కమలారెడ్డి తదితరులు పాల్గొన్నారు.