హైదరాబాద్ జూలై 10 (నమస్తే తెలంగాణ)/ సైదాబాద్ : ఏడో ఆలిండియా పోలీస్ డ్యూటీ మీట్‌ను విజయవంతంగా నిర్వహించిన ఉన్నతాధికారులకు ప్రతిష్టాత్మక డైరెక్టర్ జనరల్ కామండేషన్ సర్టిఫికెట్లు దకాయి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని బీపీఆర్‌అండ్‌డీ డైరెక్టర్ జనరల్ ఈ అవార్డులను ప్రకటిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ గౌరవాన్ని అందుకున్న వారిలో తెలంగాణ జైళ్ల శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు, అకాడమీ ప్రొఫెసర్లు ఉన్నారు. వీరిని రాష్ట్ర జైళ్లశాఖ డీజీ సౌమ్యామిశ్రా అభినందించారు.
1) ఎన్ మురళీబాబు-ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్(వెల్ఫేర్ అండ్ సీఏ) (2) డాక్టర్ డీ శ్రీనివాస్ – డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ (3) సంతోష్ కుమార్‌రాయ్ – సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ (4) ఎన్ శివకుమార్‌గౌడ్ – సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ (5) టీ కళాసాగర్ – సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ (6) డీ భరత్ – డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ (7) ఎస్ శ్రీనివాస్‌రెడ్డి – డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ (8) పీ అశోక్ కుమార్ – డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ (9) వై రామయ్య – డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ (10) కే శ్రీమాన్ రెడ్డి – డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ (11) డాక్టర్ టీ హెచ్ అన్సార్ – ప్రొఫెసర్, ఏపీసీఏ, వెల్లూరు (12) డాక్టర్ ఏ మదన్‌రాజ్ – ప్రొఫెసర్, ఏపీసీఏ, వెల్లూరు.