హైదరాబాద్, అక్టోబర్ 8(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నాయకుడు నవీన్‌యాదవ్ (Naveen Yadav) చట్టవ్యతిరేకంగా ఓటరు గుర్తింపు కార్డులు పంపిణీ చేసినట్టు వచ్చిన వార్తలపై ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. అక్టోబర్ 6న ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన వార్తతోపా టు బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు ఫిర్యాదు చేసినట్టు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (CEO) ఎక్స్ వేదికగా తెలిపారు.
నవీన్‌యాదవ్ యూసుఫ్‌గూడ లో ఓటరు కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్టు, అదేరోజు సాయంత్రం ఈ ఘటనపై జూబ్లీహిల్స్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నివేదిక సమర్పించినట్టు పేర్కొన్నారు. దీనిపై మధురానగర్ పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ న మోదైనట్టు, ఓటర్ల ను ప్రభావితం చేసేందుకు హాలోగ్రామ్ లేకుండా ఉన్న ప్రింటెడ్ ఎపిక్‌కార్డులు పంపి ణీ చేసినట్టు విచారణలో వెల్లడైందని తెలిపారు. ఎన్నికల చట్టాల మేరకు చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు.