హైదరాబాద్, జనవరి 9 (నమస్తేతెలంగాణ): గతేడాది డిసెంబర్14, 15న సీబీఎస్ఈ నిర్వహించిన సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటి టెస్ట్-24 ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. అభ్యర్థులు హాల్‌టికెట్ నంబర్ ఎంటర్ చేసి ctet.nic.in వెబ్సైట్ ద్వారా ఫలితాలు చూసుకోవచ్చు. కాగా, ఈ పరీక్షను దేశవ్యాప్తంగా 20 భాషాల్లో నిర్వహించారు.
హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): వివిధ క్యాటగిరీల్లో పంచాయతీ కార్యదర్శుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 18 మందికి స్పౌజ్, ముగ్గురికి మెడికల్ క్యాటగిరీల్లో ట్రాన్స్‌ఫర్స్‌కు అవకాశం కల్పించింది. వివిధ క్యాటగిరీల్లో ట్రాన్స్ఫర్ కోసం 44 మంది కార్యదర్శులు దరఖాస్తులు చేసుకోగా 21 మందికి అవకాశం లభించింది. వీరికి శుక్రవారం పంచాయతీరాజ్ కమిషర్ ఉత్తర్వులు అందించనున్నారు.