హైదరాబాద్, మార్చి 12: తెలంగాణ వాహనాల రిజిస్ట్రేషన్ ప్రిఫిక్స్ను ‘టీఎస్’ నుంచి ‘టీజీ’గా మార్చాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో ఇకపై వాహనాల నంబర్ ప్లేట్లు టీజీతో ప్రారంభం అవుతాయి. ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వశాఖ మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదలచేసింది వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్‌లో టీఎస్‌కు బదులుగా టీజీని తీసుకురాబోతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే తెలిపింది. ఈ విషయం తెలుపుతూ కేంద్రానికి లేఖ రాసింది. తాజాగా, ఈ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.