హైదరాబాద్ : పల్లె పదం, తెలంగాణ ఆత్మగానం, జానపద జనగీతం, కవి, తాత్వికుడు, అలతి అలతి పదాలతో అనంతలోకాలను గానం చేసిన కవి గాయకుడు గోరటి వెంకన్నకు రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు జేజేలను తెలిపారు. అలాగే తెలంగాణ బిడ్డలు తగుళ్ల గోపాల్, దేవరాజు మహారాజుకు అల్లం నారాయణ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.