హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): సాధారణ ఎన్నికల వేళ ప్రజలకు, ఓటర్లకు అవసరమైన సమాచారం, ఫిర్యాదులు చేయడానికి, సందేహాలను తీర్చుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందుకు https:// ceotelangana.nic.in వెబ్సైట్ ఓపెన్ చేయగానే కింది భాగంలో ‘ఆస్క్ ఓటర్ సహాయ మిత్ర’ పేరు తో బాక్స్‌ను ఏర్పాటు చేశారు.
దానిని క్లిక్ చేయగానే తొమ్మిది రకాల ఆప్షన్లు వస్తాయి. వీటిలో ఏది అవసరమో దానిపై క్లిక్ చేస్తే సమాచారం పొందవచ్చు. ఈ సర్వీస్ ప్రతీరోజూ 24 గంటలు అందుబాటులో ఉంటుంది.