కస్టమ్స్ అధికారుల ఇండ్లలో సీబీఐ సోదాలు
విదేశీ కరెన్సీని అక్రమ పద్ధతుల్లో మార్పిడి చేసినందుకు ప్రయత్నించిన ఇద్దరు కస్టమ్స్ విభాగం ఆఫీస్ సూపరింటెండెంట్లు, ఒక ఇన్స్పెక్టర్ ఇండ్లలో, వారి బంధువుల ఇండ్లల్లో సీబీఐ అధికారులు సోదాలు చేపట్టారు.
- ముగ్గురిపై కేసు నమోదు
హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): విదేశీ కరెన్సీని అక్రమ పద్ధతుల్లో మార్పిడి చేసినందుకు ప్రయత్నించిన ఇద్దరు కస్టమ్స్ విభాగం ఆఫీస్ సూపరింటెండెంట్లు, ఒక ఇన్స్పెక్టర్ ఇండ్లలో, వారి బంధువుల ఇండ్లల్లో సీబీఐ అధికారులు సోదాలు చేపట్టారు. ఆదివారం హైదరాబాద్‌లో మూడు చోట్ల, ఢిల్లీలోని ఓ ప్రాంతంలో ఈ సోదాలు జరిపారు. వివరాల్లోకెళ్తే… శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ విమానాశ్రయం కస్టమ్స్ విభాగంలో పనిచేస్తున్న ఆఫీస్ సూపరింటెండెంట్లు వై శ్రీనివాసులు, పేరి చక్రపాణి, ఇన్స్పెక్టర్ పంకజ్ గౌతమ్‌లు విదేశీ కరెన్సీని గత మార్చి 16న ఆఫీస్‌బాయ్ ఓంప్రకాశ్ దత్తాతో మా ర్పిస్తుండగా సీఐఎస్ఎఫ్ క్రైం ఇంటెలిజెన్స్ విభాగం అదుపులోకి తీసుకొన్నది.
కరెన్సీ మార్పిడికి వచ్చిన బహదూరపురాకు చెందిన గులామ్లీ, సాజిత్, ఓంప్రకాశ్ దత్తాను విచారించగా కస్టమ్స్ అధికారుల పాత్ర ఉన్నట్టు తేలింది. వీరి వద్ద నుంచి 6,97,805 విలువైన ఇండియన్, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకొన్నారు. దీనిపై ఆర్జీఐఏ కస్టమ్స్ కమిషనరేట్‌లోని డిప్యూటీ కమిషనర్ అలేఖ్య బల్లా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురు అధికారులపై ఈనెల 28న సీబీఐ కేసునమోదు చేసిం ది. తాజాగా సీబీఐ హైదరాబాద్, ఢిల్లీలో నాలుగుచోట్ల సోదాలు నిర్వహించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

