తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని తెలంగాణకు చెందిన పలువురు ప్రముఖులు మంగళవారం దర్శించుకున్నారు. మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్ భానుప్రసాదరావు, ఎంఎల్ఏ వివేక్గౌడ్, ఎమ్మెల్సీలు కేకే మునిందర్రెడ్డి, రాజు, డీఎల్ రవీంద్రరెడ్డి వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయక మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందచేశారు.
ఆలయం వెలుపల మంత్రి గంగుల ప్రభాకర్ మాట్లాడుతూ స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారని కేసీఆర్ పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని ప్రార్థించానన్నారు. స్వామి అమ్మవార్ల ఆశీస్సులతో కొత్త రాష్ట్రంలో అద్భుత ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు. రాబోయే కాలంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని సీఎం కేసీఆర్ యాదాద్రిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు.. అలాగే ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు.