సావిత్రిబాయి ఫూలే ఫెలోషిప్‌కు సీలింగ్ ఎత్తివేత
ఉన్నత విద్యలో మహిళల నమోదు పెంచడం, డ్రాపౌట్ రేటును తగ్గించడంలో భాగంగా సావిత్రిబాయి ఫూలే సింగిల్ గర్ల్‌చైల్డ్ ఫెలోషిప్‌ల నిబంధలను సవరించినట్టు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ మామిడాల జగదీశ్‌కుమార్ తెలిపారు.
- అర్హులైన వారందరికీ అమలు
- ఇంజినీరింగ్, టెక్నాలజీ వారికి చాన్స్
- యూజీసీ చైర్మన్ ఎం జగదీశ్‌కుమార్
హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): ఉన్నత విద్యలో మహిళల నమోదు పెంచడం, డ్రాపౌట్ రేటును తగ్గించడంలో భాగంగా సావిత్రిబాయి ఫూలే సింగిల్ గర్ల్‌చైల్డ్ ఫెలోషిప్‌ల నిబంధలను సవరించినట్టు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ మామిడాల జగదీశ్‌కుమార్ తెలిపారు. గతంలో ఏటా స్లాట్లపై సీలింగ్ విధించి, కొంతమందికే ఫెలోషిప్లను అందజేసేవారని గుర్తుచేశారు. ప్రస్తుతం ఫెలోషిప్‌ల స్లాట్ల సీలింగ్‌ను పూర్తిగా ఎత్తివేశామని వెల్లడించారు. ఇదివరకు హ్యుమానిటీస్, సోషల్‌సైన్సెస్ వారికే ఫెలోషిప్‌లు ఇచ్చేవారని, ఇప్పుడు ఇంజినీరింగ్, టెక్నాలజీ కోర్సుల్లోని అమ్మాయిలకు కూడా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. నిరుడు సెప్టెంబర్‌లో సావిత్రిబాయి ఫూలే సింగిల్ గర్ల్‌చైల్డ్ ఫెలోషిప్‌కు 1,144 దరఖాస్తులొచ్చాయని చెప్పారు. వీటిలో 1,129 దరఖాస్తులను తాత్కాలికంగా ఎంపిక చేశామని పేర్కొన్నారు. అండమాన్ నికోబార్ నుంచి 1, ఈశాన్యభారతం సరిహద్దుల్లోని ప్రాంతాల నుంచి 89 దరఖాస్తులు వచ్చినట్టు జగదీశ్‌కుమార్ వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

