Telangana | తెలంగాణలో 80 ఏండ్లు దాటిన ఓటర్లకు శుభవార్త.. ఇంటి నుంచే ఓటేసేందుకు అవకాశం..
Telangana | తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా 80 ఏండ్లు దాటిన వారు ఇంటి నుంచే ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాలపై సమీక్ష కోసం రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన గురువారంతో ముగిసింది.
Telangana | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా 80 ఏండ్లు దాటిన వారు ఇంటి నుంచే ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాలపై సమీక్ష కోసం రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన గురువారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఇతర కమిషనర్లతో కలిసి హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణలో స్త్రీ, పురుష ఓటర్లు దాదాపు సమానంగా ఉండటం శుభ పరిణామం అని పేర్కొన్నారు. యువ ఓటర్ల సంఖ్య 8 లక్షలు దాటడం ప్రశంసించదగ్గ విషయమన్నారు. 2022-23 ఏడాదిలో 22 లక్షలకు పైగా ఓట్లను పరిశీలించి తొలగించినట్లు తెలిపారు. ఏకపక్షంగా ఓట్లను తొలగించలేదని స్పష్టం చేశారు. ఫామ్ అందిన తర్వాతే ఓట్లను తొలగించినట్లు పేర్కొన్నారు. జులై తర్వాత దరఖాస్తు చేసుకున్న 2.21 లక్షల యువతకు ఓటు హక్కు కల్పించామన్నారు. 66 నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. 18 నుంచి 19 ఏండ్ల యువ మహిళా ఓటర్లు 3.45 లక్షలు ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం పోలింగ్ స్టేషన్లు 35,356 ఉండగా, ఒక్కో పోలింగ్ స్టేషన్లో సగటు ఓటర్ల సంఖ్య 897గా ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించామని ఆయన తెలిపారు. ఆయా పార్టీల సూచనలు, సలహాలను స్వీకరించామన్నారు. ఎన్నికల ఖర్చు పెంచాలని కొందరు అడిగారని చెప్పారు. ఫిర్యాదుల స్వీకరణ కోసం సీ విజిల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని రాజీవ్ కుమార్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

