హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్ట్ 14(నమస్తే తెలంగాణ): ఆలోచనలను ఆవిష్కరణలుగా తీర్చిదిద్దుకునేందుకు సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ ఇం క్యుబేషన్ సెంటర్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తుంది. మాలిక్యులార్ డయాగ్నోస్టిక్స్, ఇండస్ట్రీయల్ బయోటెక్నాలజీ, బయోమెడికల్ డివై జ్, అగ్రికల్చర్ బయోటెక్నాలజీ, థెరపాటిక్స్ అంశాల్లో పనిచేసే స్టార్టప్లకు ఇంక్యుబేషన్ సేవలను అందించనుంది. 18లోగా దరఖాస్తు చేసుకోవాలి.
వ్యవసాయ యూనివర్సిటీ, ఆగస్టు 14: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జాతీయ స్థాయిలో 37వ ర్యాంకు సాధించిందని రిజిస్ట్రార్ డాక్టర్ రఘురామిరెడ్డి తెలిపారు. బోధన, పరిశోధన, విస్తరణ విభాగాల్లో జాతీయస్థాయిలో 145 వ్యవసాయ, అనుబంధ సంస్థలు పాల్గొన్నాయని తెలిపారు.
హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘యంగ్ ఇండి యా స్కిల్స్ యూనివర్సిటీ తెలంగాణ’ గెజిట్ జారీ అయ్యింది. ఈ బిల్లు ఇటీవలే అసెంబ్లీలో ఆమోదం తెలపగా, గవర్నర్ సైతం ఈ వర్సిటీ ఏర్పాటు బిల్లును ఆమోదించారు. దీంతో న్యాయశాఖ సెక్రటరీ ఆర్ తిరుపతి బుధవారం గెజిట్ జారీచేశారు.
హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు రాష్ట్ర ప్రభుత్వం స్థానికత నిబంధనను మార్చడాన్ని సవాలు చేసిన కేసుల్లో హైకోర్టు మ ధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్థానికతపై నిర్ణయం తీసుకునే వరకు పిటిషనర్ల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను 26కి వాయిదా వేసింది.