సూపర్ బగ్‌లతో మురుగుపై యుద్ధం
మురుగునీటిపై సూపర్బగ్లతో యుద్ధం చేసేందుకు సీసీఎంబీ సిద్ధమవుతున్నది. సూపర్ బగ్‌ల ఉనికి, వ్యాప్తి, యాంటిబయాటిక్స్‌ను ఎదుర్కొనేలా వాటిలో జరుగుతున్న జన్యు మార్పిడిని శాస్త్రీయంగా గుర్తించడంపై సెంటర్ ఫర్ మాలిక్యులర్ బయోలజీ (సీసీఎంబీ) దృష్టిసారించింది. ఈ మేరకు నగరంతోపాటు దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో
- బ్యాక్టీరియా జన్యు మార్పిడిపై ఫోకస్
- సీసీఎంబీ సైంటిస్టుల అధ్యయనం
- కరోనా వ్యాప్తిని విజయవంతంగా
- గుర్తించడంలో గతంలో సఫలం
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): మురుగునీటిపై సూపర్బగ్లతో యుద్ధం చేసేందుకు సీసీఎంబీ సిద్ధమవుతున్నది. సూపర్ బగ్‌ల ఉనికి, వ్యాప్తి, యాంటిబయాటిక్స్‌ను ఎదుర్కొనేలా వాటిలో జరుగుతున్న జన్యు మార్పిడిని శాస్త్రీయంగా గుర్తించడంపై సెంటర్ ఫర్ మాలిక్యులర్ బయోలజీ (సీసీఎంబీ) దృష్టిసారించింది. ఈ మేరకు నగరంతోపాటు దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో మురుగునీటిపై పరిశోధనలు చేయనున్నది. కొవిడ్ సమయంలో మురుగు నీటిలో కరోనా వైరస్ అవశేషాలు, వ్యాప్తి తీరును సమర్థవంతంగా గుర్తించిన సీసీఎంబీ… తాజాగా అదే తీరుగా డెంగ్యూ, మంకీ పాక్స్ వంటి వ్యాధులను పసిగట్టేందుకు దృష్టి సారించింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రవహించే నాలాలు, ఓపెన్ డ్రైనేజీలతోపాటు ఎస్టీపీల వద్ద సేకరించిన మురుగు నీటిని అధ్యయనం చేస్తారు. ఆర్టీపీసీఆర్ విధానంలో వైరస్‌లోని జన్యువుల ట్రాన్స్ ఫర్మేషన్ను గుర్తించేందుకు ఈ అధ్యయనం సాయపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
సూపర్ బగ్ పుట్టకను గుర్తించేలా
మితిమీరిన యాంటిబయాటిక్స్ వినియోగంతో బ్యాక్టీరియా, వైరస్లు వాటిని తట్టుకునేలా జన్యు మార్పిడి జరుగుతుందని ఇప్పటికే పలు పరిశోధనల్లో తేలింది. ఈ క్రమంలో కొన్ని వ్యాధులు మందులకు తగ్గకపోవడమే కాకుండా శరవేగంగా వ్యాప్తి చెందుతున్న తీరును పరిశీలించేందుకు ఈ అధ్యయనం దోహదపడుతుందని ఆశిస్తున్నారు. హైదరాబాద్‌తోపాటు కోల్‌కతా, ఢిల్లీ, చెన్నయ్, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లోని మురుగునీటిపై పరిశోధనలు చేయనున్నారు. దాదాపు 40ఎంఎల్ మురుగునీటి శాంపిళ్లలో బ్యాక్టీరియా, వైరస్ల జన్యు మార్పిడి తీరు స్పష్టం తెలుసుకునే వీలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

