Creepy Crawlies | హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ): వందకు పైగా కాళ్లతో పాకుతూ తిరిగే శతపాదులు (జెర్రి జాతి)పై కొంత కాలంగా అధ్యయనం చేస్తున్న సీసీఎంబీ.. ఆ విష పురుగులో ఉండే విష ప్రభావంపై అంచ నా వేస్తున్నది. అరుదైన జీవావరణం విస్తరిం చి ఉన్న పశ్చిమ కనుమల్లో పరిశోధనలు సాగిస్తున్న సీసీఎంబీ ఈ తరహా జీవుల సంరక్షణకు తీసుకోవల్సిన చర్యలపై అధ్యయనం చేస్తున్నది. శతపాది జాతులకు చెందిన జీవు ల్లో న్యూరోటాక్సిక్, సైటో టాక్సిక్ ప్రొటీన్లు, పప్టైడ్ల కాక్టెయిల్ ఉంటాయని సీసీఎంబీ పరిశోధకులు పేర్కొన్నారు.
జెర్రి కాటు వేస్తే చలి, జ్వరం, బలహీనత, వాపు, చర్మ సమస్యలు, ఎలర్జీ, రక్తస్రావం, తీవ్రమైన నొప్పి కలుగుతాయని, మరణాలు చాలా సంభవిస్తాయని వివరించారు. జెర్రిలో విష ప్రభావంపై శాస్త్రీయ ఆధారాలతోపాటు చారిత్రక ఆధారాలను తెలుసుకునే దిశగా అధ్యయనం చేస్తున్నారు. చరక సంహితలోనూ శతపాది విష గుణాల గురించి ఉండగా పలు సంప్రదాయ వైద్య విధానాల్లోనూ శతపాది విషం ప్రస్తావన ఉన్నట్టు చెప్తున్నారు. కణతులు, దగ్గు, గజ్జి, గుండె సంబంధిత వ్యాధులను కట్టడి చేసేందుకు అవసరమైన రసాయనిక మిశ్రమాలు ఆ విషంలో ఉన్నట్టు చెప్తున్నారు. అయితే దాని విష ప్రభావ తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నారు.