ఏసీబీ వలలో అవినీతి చేప
గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థకు చెందిన ఓ అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. గ్రామైక్య సహాయకురాలికి నెలనెలా వచ్చే గౌరవ వేతనం రిలీజ్ చేసేందుకు లంచం డిమాండ్ చేసి, మంగళవారం అడ్డంగా దొరికిపోయింది. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, బాధితురాలు వీవోఏ స్వప్న తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం పెద్దంపల్లిలో శ్రీరాజరాజేశ్వర గ్రామైక్య సంఘానికి సహాయకురాలిగా దొడ్డె స్వప్న పనిచేస్తున్నది.
- జమ్మికుంట సెర్ప్‌లో రూ.10 వేలు తీసుకుంటుండగా సీసీ పట్టివేత
జమ్మికుంట, ఏప్రిల్ 8 : గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థకు చెందిన ఓ అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. గ్రామైక్య సహాయకురాలికి నెలనెలా వచ్చే గౌరవ వేతనం రిలీజ్ చేసేందుకు లంచం డిమాండ్ చేసి, మంగళవారం అడ్డంగా దొరికిపోయింది. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, బాధితురాలు వీవోఏ స్వప్న తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం పెద్దంపల్లిలో శ్రీరాజరాజేశ్వర గ్రామైక్య సంఘానికి సహాయకురాలిగా దొడ్డె స్వప్న పనిచేస్తున్నది. ఆమెకు ప్రాజెక్టు నుంచి నెలకు రూ.5వేల గౌరవ వేతనం గ్రామైక్య సంఘం ఖాతాలో పడుతున్నది. ఆ డబ్బు తీసుకోవాలంటే సంఘం లీడర్లతో పాటూ సెర్ప్ సీసీ అనుమతి తప్పనిసరి. దీనిని సీసీ సురేశ్ ఆసరాగా చేసుకుని.. లంచం ఇస్తేనే గౌరవ వేతనం రిలీజ్ చేయిస్తానని ఐదు నెలలుగా అడ్డుకుంటున్నాడు. స్వప్న మంగళవారం సెర్ప్ కార్యాలయానికి వచ్చి రూ.10వేలను సీసీ సురేశ్‌కు ఇచ్చారు. వెంటనే ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ.10వేలు లంచం
- ఏసీబీకి చిక్కిన చింతలపాలెం ఎస్సై

చింతలపాలెం, ఏప్రిల్ 8 : పీడీఎస్ బియ్యం కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ ఓ ఎస్సై ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చింతలపాలెంలో చోటుచేసుకున్నది. నిరుడు అక్టోబర్ 23న పీడీఎస్ బియ్యం రవాణా విషయంలో ఆరుగురిపై కేసు నమోదైంది. కేసులో ఓ వ్యక్తికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఎస్సై రూ.15 వేలు డిమాండ్ చేయగా చివరకు రూ.10 వేలకు ఒప్పందం కుదిరింది. రూ.10 వేలు లంచం తీసుకోగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

