మెదక్, మార్చి 21( నమస్తే తెలంగాణ) : మెదక్ పట్టణంలోని సెంట్రల్ జీఎస్టీ కార్యాలయంలో సీబీఐ, ఏసీబీ అధికారుల నిర్వహించిన సోదాలు శుక్రవారం కలకలం సృష్టించాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయం త్రం ఆరున్నర వరకు సీబీఐ ఏసీబీ విభాగం ఇన్స్పెక్టర్ ధనుంజయ్ నేతృత్వంలో విచారణ జరిపి సెంట్రల్ జీఎస్టీ సూపరింటెండెంట్ రవిరంజన్ అగర్వాల్‌ను అరెస్ట్ చేసి హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో జడ్జి ఎదుట హాజరు పరిచారు.
కృష్ణ అనే వ్యక్తి అతనిపై ఇచ్చిన ఫిర్యాదుపై అతనిపై నిఘా పెట్టి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు ఏసీబీ అధికారులు వెల్లడించారు.