ఆదిబట్ల, నవంబర్ 29: గొర్రెల పంపిణీ పథకం కింద లబ్ధిదారులకు నగదు బదిలీ చేయాలని కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్ కోరారు. మంగళవారం వారు కురుమ సంఘం నాయకులతో కలిసి ఆర్థిక శాఖ మంత్రి టీ హరీశ్‌రావు, రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్‌లను వేర్వేరుగా కలిసి కురుమల సంక్షేమం, అభివృద్ధిపై చర్చించారు. తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని, కురుమలకు రాజకీయంగా అవకాశాలు కల్పించాలని మంత్రుల దృష్టికి తీసుకెళ్లగా వారు సానుకూలంగా స్పందించినట్టు యెగ్గె మల్లేశం తెలిపారు.