హుజూరాబాద్ టౌన్, అక్టోబర్ 11: ఎన్నికల నియమావళి, కొవిడ్ నిబంధనలు పాటించకుండా పరిమితికి మించి మీటింగ్ నిర్వహించిన బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్‌పై సోమవారం కేసు నమోదు చేసినట్టు హుజూరాబాద్ టౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. హుజూరాబాద్ పట్టణంలోని హనుమాన్ టెంపుల్ వద్ద కొవిడ్ నియమాలకు విరుద్ధంగా, ఎన్నికల నియమావళి పాటించకుండా ఈటల అధ్వర్యంలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించగా, దీనికి పరిమితికి మించి ప్రజలు హాజరయ్యారని ఫ్లయింగ్ స్వాడ్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజేందర్‌పై అండర్ 188 ఐపీసీ, సెక్షన్ 51 (బీ) డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్- 2005 కింద కేసు నమోదు చేసినట్టు వివరించారు.