బంజారాహిల్స్, జూన్ 2: తమ సమస్యల పరిష్కారం కోసం సీఎం రేవంత్ ఇంటిని ముట్టడించడానికి యత్నించిన 21మంది మాజీ సర్పంచుల సంఘం నేతలపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో సర్పంచ్‌లుగా పనిచేసిన తమకు రావాల్సిన బకాయిలు అందించాలని, 1న రాష్ట్ర సర్పంచ్ల సంఘం నేతలు కేశబోయిన మల్లయ్యతోపాటు మాజీ సర్పంచ్‌లు సీఎం ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. ఈక్రమంలో పోలీసులు మల్లయ్యతోపాటు మరో 20మందిపై కేసు నమోదు చేశారు.